News March 12, 2025

APPLY NOW.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

AP: 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ <>నోటిఫికేషన్<<>> విడుదల చేసింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, YSR, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు(17.5-21 ఏళ్లు) APR 10లోగా దరఖాస్తులు సమర్పించాలి. జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్ టెక్నికల్, వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేయవచ్చు.

Similar News

News February 19, 2026

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

image

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.

News February 19, 2026

ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

image

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?

News February 19, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.