News March 12, 2025
APPLY: అకౌంట్లలోకి రూ.6,000

రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.
వెబ్‌సైట్: <
Similar News
News March 23, 2025
కత్తెర పట్టుకుంటే రూ.లక్ష ఫీజు తీసుకుంటాడు!

హెయిర్ కట్‌కు సెలూన్ షాప్‌లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్లలో రూ.200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలూన్ అయినా రూ.500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీమ్ హకీమ్ అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం రూ.లక్ష తీసుకుంటాడు. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజినీ, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పుడు సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.
News March 23, 2025
బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.
News March 23, 2025
పార్లమెంట్‌లో రేపు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

AP: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రేపటి నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాళ్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.