News April 26, 2024

కొడాలి, బుగ్గన నామినేషన్లకు ఆమోదం

image

AP: YCP అభ్యర్థులు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్లకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. నామినేషన్ పత్రాల్లో నాని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆర్వోకు TDP ఫిర్యాదు చేసింది. సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి నామినేషన్‌ను ఆమోదించినట్లు ఆర్వో ప్రకటించారు. బుగ్గన తన ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదని TDP అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టిన ఆర్వో.. తర్వాత ఆమోదించారు.

Similar News

News April 14, 2026

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

image

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.

News April 14, 2026

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

image

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

News April 14, 2026

రియల్ హీరో❤️

image

వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెట్టడానికే మనం విసుగు చెందుతాం. కానీ గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన హర్సుఖ్‌భాయ్ వఘాసియా మాత్రం పదివేల పక్షులకు ‘అన్నదాత’గా మారారు. 28 ఏళ్ల క్రితం ఒక పిట్టతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు 4 ఎకరాల్లో 10వేల పక్షుల కడుపు నింపే స్థాయికి చేరింది. దీనికోసం ఆయన ఏటా ₹2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విలాసాలకు దూరంగా ఉంటూ మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వఘాసియా నిజమైన హీరో.