News April 14, 2024
ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జననం
1950: భారత్ తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి
Similar News
News December 11, 2025
ఇంత గందరగోళానికి ఇండిగోనే కారణం: రామ్మోహన్

ఇండిగో విమాన సేవలు తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తలెత్తిన సంక్షోభానికి ఆ సంస్థ ‘మిస్ మేనేజ్మెంట్’ మాత్రమే కారణమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘వారి అంతర్గత సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొంది. FDTL మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా దానిని నివారించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని తెలిపారు.
News December 11, 2025
‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
News December 11, 2025
5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.


