News April 20, 2024

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

image

1889: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జననం
1950: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
1972: సినీ నటి అంజలా జవేరీ జననం
1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం

Similar News

News December 7, 2025

WGL: వామ్మో మేం ఓటేస్తే మా పని ఖతమే..!

image

పంచాయతీ ఎన్నికలు విధుల్లో పాల్గొనే ఉద్యోగులను కలవర పెడుతున్నాయి. డ్యూటీ చేసే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారు. ఓట్ల లెక్కింపుల్లో ఆ ఉద్యోగి ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండడంతో, ఎందుకొచ్చిన గొడవ అంటూ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామ పోరులో వార్డు ఓటర్లు వందల సంఖ్యల్లోనే ఉండడమే వారికి భయం పట్టుకుంది.

News December 7, 2025

సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

image

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.

News December 7, 2025

ఇండిగో సంక్షోభం: గుత్తాధిపత్యమే ముంచిందా?

image

దేశంలో విమానయాన సంక్షోభానికి ఇండిగో గుత్తాధిపత్యమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండిగో(63%), ఎయిరిండియా(20%) తప్ప మిగతా సంస్థల వాటా నామమాత్రమే. కానీ 2014లో ఇండిగో(31.8%), జెట్ ఎయిర్‌వేస్(21.7%), ఎయిరిండియా(18.4%), స్పైస్ జెట్(17.4%), గో ఎయిర్(9.2%) ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు ఇండిగోలో సిబ్బంది కొరతతో పరిస్థితి తీవ్రమైంది. అదే మరిన్ని సంస్థలు ఉంటే ఇలా జరిగేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.