News August 22, 2025

ఇవాళ స్కూళ్లు, కాలేజీలూ బందేనా?

image

మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ <<17479279>>బంద్‌కు<<>> ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో పలు ప్రాంతాల్లో షాపులు మూతబడనున్నాయి. బంద్‌కు వ్యాపారులు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారు. వాణిజ్యానికి సంబంధించిన అంశం కాబట్టి స్కూళ్లు, కాలేజీలపై ప్రభావం చూపే అవకాశం లేదు. నేడు స్కూళ్లకు సెలవు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు రాలేదని తెలుస్తోంది. మరి మీకేమైనా హాలిడే అని మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

Similar News

News January 18, 2026

ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>EdCIL<<>> APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/

News January 18, 2026

2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

image

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్‌తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు.

News January 18, 2026

నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.