News August 13, 2025
అతి వేడి ఆహారం తింటున్నారా?

చాలా మంది వేడి వేడి ఆహారం తినేందుకు ఇష్టపడతారు. కానీ ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘వేడి ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే అన్నవాహికకు నష్టం జరుగుతుంది. గొంతులో ఉండే చర్మం పాడవుతుంది. నాలుకపై ఉండే కణాలు నాశనమై ఆహారం రుచిని ఆస్వాదించలేము. కడుపు, పేగులు దెబ్బతిని జీర్ణసమస్యలు తలెత్తుతాయి. అన్నవాహిక క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 15, 2026
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.
News March 15, 2026
దీదీ వర్సెస్ మోదీ.. బెంగాల్‌లో దంగల్

బెంగాల్‌లో APR 23, 29న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కాషాయాన్ని విస్తరిస్తున్న BJP బెంగాల్‌లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు TMC చీఫ్ మమతా బెనర్జీ(దీదీ) మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కమలం వికసించకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బెంగాల్‌లో దంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది.
News March 15, 2026
మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.


