News April 1, 2024

దాహంతో అల్లాడాల్సిందేనా?

image

బెంగళూరు నీటి కష్టాలు దేశంలోని ఇతర నగరాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో 2030నాటికి 40% ప్రజలకు సరైన తాగునీటి వసతి ఉండదని నీతి ఆయోగ్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2050కల్లా ఢిల్లీ, ముంబై, లక్నో, HYD, విశాఖపట్నంతో సహా డజనుకుపైగా నగరాల్లోని ప్రజలు దాహంతో అల్లాడక తప్పదని వరల్డ్ వైడ్ ఫండ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఇండో-గంగా బేసిన్‌లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని UN సైతం పేర్కొంది.

Similar News

News February 15, 2026

బంగ్లా ప్రయోజనాలకే ప్రాధాన్యం: తారిఖ్ రెహ్మాన్

image

బంగ్లాదేశ్, ప్రజల ప్రయోజనాలే తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. ‘ఈ గెలుపు బంగ్లాది. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం. హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నాం. ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నా’ అని చెప్పారు. తాజా ఎన్నికల్లో BNP <<19134014>>భారీ మెజారిటీ<<>>తో గెలవడం తెలిసిందే.

News February 15, 2026

శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.

News February 15, 2026

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)