News March 6, 2025
ASF: ఆదివాసీ గ్రామాలను సందర్శించిన ఏఎస్పీ

కెరమేరి మండలంలోని మారుమూల ప్రాంతాలైన చాల్బాడి, టోకెన్ మొవాడ్, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం ఏఎస్పీ చిత్త రంజన్ బైక్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి అసాంఘిక శక్తులకు సహాయం చేయవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మీకు పోలీసులు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.
Similar News
News December 8, 2025
పల్నాడు: మహిళల కోసం డీజీ లక్ష్మి పథకం

పల్నాడులో మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని డిగ్రీ చదువుకున్న యువతులకు డీజీ లక్ష్మి పేరుతో ఆన్లైన్ సేవలను ప్రారంభిస్తుంది. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా నరసరావుపేటలో 77, చిలకలూరిపేటలో 65, మాచర్లలో 32, పిడుగురాళ్లలో 35, సత్తెనపల్లిలో 32, వినుకొండలో 42, గురజాలలో 13, దాచేపల్లిలో 23 కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
News December 8, 2025
కామారెడ్డి: పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం దోమకొండలో పోస్టల్ బ్యాలెట్ కౌంటర్‌ను సందర్శించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న విధానాన్ని పరిశీలించి, ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ పాల్గొన్నారు.
News December 8, 2025
IIIT-నాగపుర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

IIIT-నాగపుర్ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.


