News November 30, 2025
ASF కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు

ఓటర్ల సందేహల నివృత్తి, ఇతర సమాచారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ 8500844365 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూం సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని.. ప్రజలు సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News February 13, 2026
HYD: BEWARE OF రొమాన్స్ స్కామ్స్.. జాగ్రత్త బ్రో!

వాలంటైన్స్ డే ఆఫర్లంటూ వచ్చే లింకులు నొక్కారో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. గతేడాది మన రాష్ట్రంలో రొమాన్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ద్వారా ఏకంగా ₹12.65 కోట్లు కొల్లగొట్టారు. గిఫ్టులు, ఫ్లవర్ డెలివరీల పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. గుర్తుతెలియని వ్యక్తులకు ఫొటోలు, ఓటీపీలు షేర్ చేయొద్దు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. బీ అలర్ట్ బాసూ!
News February 13, 2026
తమన్నా ‘బోల్డ్’ హారర్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారారు. బాలీవుడ్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి MMS’ థర్డ్ పార్ట్‌లో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్ నిర్మించే ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. శశాంక ఘోష్ డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీలో బోల్డ్ కంటెంట్‌తో పాటు ‘డేట్ నైట్ హారర్’ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను అలరించనున్నాయి.
News February 13, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: సీఎస్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్ఐవోలు పాల్గొన్నారు.


