News December 3, 2025
ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.
Similar News
News February 13, 2026
గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
News February 13, 2026
NRPT: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత!

NRPT జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 550 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News February 13, 2026
అనకాపల్లి: శివరాత్రికి శైవ క్షేత్రాలకు నడిచే బస్సులు ఎన్ని అంటే?

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి శైవ క్షేత్రాలకు 95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అధికారిణి ప్రవీణ తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రావికమతం మండలం కళ్యాణపులోవ, గొలుగొండ మండలం దారమఠం, విజయనగరం జిల్లా పుణ్యగిరి శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.


