News December 3, 2025
ASF: డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారానికి జిల్లాలోని అన్ని కోర్టుల కృషి చేయాలని ASF జిల్లా న్యాయమూర్తి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా పోలీస్, అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ పై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ కేసులని పరిష్కరించుకొని శాంతియుతంగా జీవనం సాగించాలన్నారు.
Similar News
News February 10, 2026
తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: డీకే అరుణ, రామచందర్ రావు

మక్తల్‌లో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప కుటుంబ సభ్యులను BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీ డీకే అరుణ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుకు విరుద్ధంగా ఓటమి భయంతోనే మహదేవప్ప మృతి చెందినట్లు FIR మార్చడం దుర్మార్గమన్నారు. బాధ్యులైన వారిని తప్పించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు DGP కి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
News February 10, 2026
కపిలతీర్థం: Photo Of The Day

తిరుపతిలోని కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం భూత వాహనంపై శ్రీకామాక్షి సమేత సోమస్కందమూర్తి దర్శనం ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో స్వామివారిని ఊరేగించారు. కపిలతీర్థం సర్కిల్ వద్ద స్వామివారు, శివలింగం ఒకే ఫ్రేమ్‌లో కనపడేలా తీసిన ఫొటో వైరలవుతోంది.
News February 10, 2026
పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.


