News May 12, 2024
ASF: పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు.. వాగులోకి..!

అసిఫాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కెరమెరి మండలం కరంజివాడ వద్ద పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సు వాగులోకి పూర్తిగా వెళ్లకుండా బస్సును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలింగ్ సిబ్బంది బస్సు దిగి కాలినడకన కరంజివాడ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
Similar News
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 11, 2025
నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఇన్‌ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.


