News January 24, 2025
ASF: మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌లో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.25.04 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును గురువారం ఆయన అందించారు. మంచిర్యాల, ఆదిలాబాద్ టీజీబీ మేనేజర్లు మురళీ మనోహర్‌రావు, ప్రభుదాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
టెన్త్ అర్హతతో 1,154 పోస్టులు.. నేడే లాస్ట్

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఏసీ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. రూ.100 ఫీజు చెల్లించి www.rrcecr.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.
News February 14, 2025
రేషన్ కార్డులపై అయోమయంలో ప్రజలు !

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నూతన రేషన్ కార్డుల జారీ పథకంలో భాగంగా ప్రజలు అయోమయంలో పడ్డారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి నాలుగు పథకాలను అమలు చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు అందజేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీ సేవలో అప్లై చేసుకోవాలనడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
News February 14, 2025
ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.