News November 17, 2025

ASF: వడ్డీ వ్యాపారులకు చిరు వ్యాపారులే టార్గెట్

image

ASF జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. గతంలో వడ్డీ వ్యాపారులపై దాడులు కూడా జరిగిన వారి దందా మాత్రం ఆగడం లేదు.

Similar News

News January 15, 2026

MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
#SHARE IT

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 15, 2026

మురిపించిన వేళ్ల విన్యాసం.. పరవశించిన ముంగిళ్లు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు సంబరంగా జరిగాయి. జిల్లాలోని ప్రతి ఇల్లూ కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో కళకళలాడింది. ముగ్గుల పోటీలు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతులు, చిన్నారులు తమ వేళ్ల విన్యాసంతో ముంగిళ్లను మురిపించారు. ప్రతి ఇంట్లో పిండివంటల ఘుమఘుమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గారెలమ్మలు, అరిసెలు, సకినాల వాసనలతో వాడలన్నీ నిండిపోయాయి.