News November 19, 2025

ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

image

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.

Similar News

News January 13, 2026

PSLV-C62 విఫలం.. ఆ 16 ఉపగ్రహాల పరిస్థితేంటి?

image

PSLV-C62 ప్రయోగం విఫలం కావడంతో అందులోని 16 ఉపగ్రహాల పరిస్థితేంటనే సందేహం వ్యక్తమవుతోంది. కక్ష్యలోకి చేరడానికి కావాల్సిన వేగం అందకపోవటంతో అవి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఇస్రో మాజీ ఇంజినీర్ ఒకరు వివరించారు. గాలితో రాపిడి వల్ల మంటలంటుకొని కాలి బూడిదైపోతాయని తెలిపారు. చిన్న శకలాలేమైనా మిగిలుంటే అవి సముద్రంలో పడిపోతాయన్నారు. సోమవారం సాయంత్రానికే ఇదంతా జరిగిపోయి ఉంటుందని వెల్లడించారు.

News January 13, 2026

ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.

News January 13, 2026

బీబీనగర్: భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బీబీనగర్‌లోని తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్, భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ భగత్ తదితరులు పాల్గొన్నారు.