News November 19, 2025

ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

image

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.

Similar News

News January 20, 2026

HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

image

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.

News January 20, 2026

మంథని జేఎన్టీయూలో జెఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

image

మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జేఈఈ మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు సెషన్లలో 80 మంది చొప్పున పరీక్ష రాయనున్నారు. ఏర్పాట్లను PDPL అడిషనల్ కలెక్టర్ వేణు పరిశీలించి ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుమన్, ఏఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.

News January 20, 2026

జగిత్యాల: ‘ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించాలి’

image

జగిత్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని చెప్పారు. క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.