News August 19, 2025
ASF: ‘వాటర్‌షెడ్ అవినీతిపై విచారణ జరిపించాలి’

వాటర్‌షెడ్ పథకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. మంగళవారం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాటర్‌షెడ్ పథకంలో జరిగిన అవినీతిలో ఏపీఎం, సీసీల భాగస్వామ్యం ఉందన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, సొమ్మును రికవరీ చేయడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News January 22, 2026
ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.
News January 22, 2026
SKLM: KR స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా, శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KR స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ విషయంలో ఎంట్రీలు, ఎగ్జిట్ అత్యవసర సమయాల్లో ప్రత్యేక మార్గాలు వినియోగంపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. DSP వివేకానంద, RDO కృష్ణమూర్తి ఉన్నారు.
News January 22, 2026
పాడేరు: ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

RBSK ప్రోగ్రామ్-DEICలో భాగంగా పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్నవారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైందని జరిగిందని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ గురువారం తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 23వ తేదీలోగా తెలపాలని సూచించారు. మరిన్ని వివరాలకు allurisitharamaraju.ap.gov.in వెబ్సైట్‌ని సంప్రదించాలన్నారు.


