News August 19, 2025

ASF: ‘విద్యార్థుల హాజరు పర్యవేక్షించాలి’

image

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ DEO దీపక్ తివారీ అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్‌లో పాఠశాలలలో విద్యార్థుల హాజరుపై MEOలు, కాంప్లెక్స్ HMలు, ఉపాధ్యాయులతో పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించారు.

Similar News

News January 20, 2026

2026 పెళ్లి ముహూర్తాలు ఇవే: పండితులు

image

శుక్ర మౌఢ్యమి కారణంగా ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు.
*ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12
*ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *AUG నుంచి OCT వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవు.
*నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12

News January 20, 2026

రోడ్డు భద్రతపై నేడు అవగాహన సదస్సు

image

రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు సాగే ఈ సదస్సులో జిల్లా కలెక్టర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

News January 20, 2026

రాసలీలల వీడియో వైరల్.. కర్ణాటక DGPపై సస్పెన్షన్ వేటు

image

కర్ణాటక సీనియర్ IPS, <<18898562>>DGP<<>> ర్యాంక్ అధికారి రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తన ఆఫీసులోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘన కింద సర్వీస్ నుంచి తొలగిస్తూ విచారణకు ఆదేశించింది. అయితే ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని రామచంద్రరావు వాదిస్తున్నారు.