News August 12, 2025

ASF: సీపీఎస్ రద్దుకు ‘చలో హైదరాబాద్’

image

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు CPS విధానాన్ని రద్దు చేయాలని సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు PRTU జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ధర్నాకు సంబంధించిన గోడపత్రాలను మంగళవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు.

Similar News

News March 14, 2026

అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తే కఠిన చర్యలు: ADB కలెక్టర్

image

ఆసుపత్రులు, వసతి గృహాలు, అనాధ శరణాలయాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులకు సూచించారు. గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డిటిలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

News March 14, 2026

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్‌మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

News March 14, 2026

సోదరిని 84 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు!

image

తనతో పాటు పుట్టిన సోదరిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపిన ఘటన UPలో జరిగింది. కవల సోదరి హిమాన్షిక(25)తో పాటు హార్దిక్ ఏడాదిన్నర కిందటి వరకు ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జాబ్ మానేశాక SMలో ఎక్కువ టైమ్ గడపడం, ఓ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయంలో సోదరుడిని హిమాన్షిక మందలించింది. కక్ష పెంచుకున్న అతను సోదరిపై 84సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి డెడ్‌బాడీ చూపించి ఆమెపైనా దాడి చేశాడు.