News November 28, 2025
ASF: పారామెడికల్ దరఖాస్తు గడువు పొడిగింపు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025-26 విద్యా సం. గాను DMLT (30), DECG (30) కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును DEC1 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు కళాశాల వెబ్‌సైట్ gmckumurambheem asifabad.orgను సంప్రదించాలని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు.
Similar News
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


