News March 26, 2025

ASF: KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

Similar News

News April 19, 2025

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!

image

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో స్కాట్లాండ్‌తో కలిసి బరిలోకి దిగనుందని సమాచారం. రెండు జట్లు కలిపి గ్రేట్ బ్రిటన్‌గా పాల్గొంటాయని క్రీడావర్గాలు తెలిపాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచులకు మొదటి ఆరు ర్యాంకుల్లో ఉన్న జట్లకు ఎంట్రీ కల్పిస్తారు.

News April 19, 2025

రైల్వే టికెట్ల మోసం.. అమాయకులు బలి!

image

కుశినగర్ EXP(22538)లో రైల్వే విజిలెన్స్ విభాగం తనిఖీలు చేయగా, తత్కాల్ టికెట్ల స్కామ్‌ బయట పడింది. UP, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి బుక్ చేసిన తత్కాల్ టికెట్లను ముంబై ఏజెంట్లు కలర్ జిరాక్స్ తీస్తున్నారని, వాటికి రూ.3వేలు అదనంగా ప్రయాణికుల వద్ద దండుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల ప్రకారం నకిలీ టికెట్లతో ప్రయాణిస్తున్న64 మందికి రూ.1.2లక్షలు జరిమానా విధించారు.

News April 19, 2025

కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.

error: Content is protected !!