News September 10, 2025
ఆసియా కప్: నేడు IND vs UAE

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-A నుంచి భారత్, UAE తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో రా.8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2016 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో విజయావకాశాలు టీమ్ ఇండియాకే ఎక్కువగా ఉన్నప్పటికీ UAEని తక్కువ అంచనా వేయొద్దని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత 7 నెలలుగా భారత్ T20లు ఆడలేదని, అటు UAEకి ఇది హోమ్ గ్రౌండ్ అని గుర్తుచేస్తున్నారు.
Similar News
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


