News September 13, 2025
ఆసియా కప్: ఒమన్‌పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్‌కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.
Similar News
News December 15, 2025
సిరిసిల్ల: రెండో విడతలో ఎవరికి ఎన్ని సీట్లంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో బోయినపల్లి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 88 గ్రామ పంచాయతీలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 స్థానాలలో విజయం సాధించారు. ప్రతిపక్ష భారాస బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 6 చోట్ల, సీపీఎం 1, ఇతరులు 11 స్థానాలలో గెలుపొందారు.
News December 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


