News September 11, 2025
ASIA CUP: బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-బీ టీమ్స్ బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. నిజాఖత్ ఖాన్ 42, జీషన్ అలీ 30, యాసిమ్ 28 రన్స్‌తో రాణించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్, టాంజిమ్, రిషాద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. 144 రన్స్ లక్ష్యంతో కాసేపట్లో బంగ్లా ఛేజింగ్ ఆరంభించనుంది.
Similar News
News December 17, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

ఉత్తరాంధ్ర ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16 ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 9-19 వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. వాటి వివరాలు..
➣జనవరి 9, 11 తేదీల్లో సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07288)
➣జనవరి 10, 12 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07289)
News December 17, 2025
30కి పైగా దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇటీవల 12 దేశాలపై విధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 30కి పైనే ఉంది. పాలస్తీనా, సిరియా, జింబాబ్వే సహా అనేక దేశాలు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి. ఇమ్మిగ్రేషన్‌పై కఠిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ దేశ పౌరుల రికార్డుల విషయంలో నమ్మకం లేకపోవడంతో పాటు అవినీతి, క్రిమినల్ కేసులు వంటివి కారణాలుగా పేర్కొన్నారు.
News December 17, 2025
పండ్ల ఉత్పత్తిలో ఏపీకి ఫస్ట్ ప్లేస్

పండ్ల తోటల సాగులో 2024-25లో 1.93 కోట్ల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే AP తొలిస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.


