News February 10, 2025
రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.
Similar News
News February 16, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి. * క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది. * వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. * మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.
News February 16, 2026
అక్కడ BRS+BJP.. ఇక్కడ BRS+కాంగ్రెస్

TG: కామారెడ్డి మున్సిపాలిటీలో BJPకి చెక్ పెట్టేందుకు INC, BRS ఒక్కటయ్యాయి. ఇక్కడ INC-19, BJP-16, BRS-11, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో INC, BRS పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. మళ్లీ INCలో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికే ఛైర్ పర్సన్ పదవి ఇచ్చేందుకు 2 పార్టీలు అంగీకరించాయి. BRSకు వైస్ ఛైర్మన్(కాసర్ల గోదావరి) పదవి దక్కనుంది. అటు అమరచింతలో BRS-BJP ఒక్కటయ్యాయి.
News February 16, 2026
APPLY NOW: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


