News May 13, 2024
వైసీపీ ఫ్రస్ట్రేషన్‌కు దాడులే నిదర్శనం: CBN

AP: ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే <<13238591>>దాడి<<>> చేయడం వైసీపీ ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని టీడీపీ చీఫ్ చంద్రబాబు అభివర్ణించారు. ‘ఓటమి ఖాయమవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, తిరుగుబాటును అణచివేయలేరు. ఐదేళ్లలో ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Similar News
News December 13, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.
News December 13, 2025
జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.
News December 13, 2025
పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


