News March 5, 2025
శుభ ముహూర్తం (05-03-2025)

☛ తిథి: శుక్ల షష్టి, రా.5.48 వరకు
☛ నక్షత్రం: భరణి, ఉ.6.58 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.11.36-నుంచి 12.24 వరకు
☛ వర్జ్యం: ఉ.6.31 నుంచి 8.02 వరకు
☛ అమృత ఘడియలు: తె.3.04 గంటల నుంచి 4.35 వరకు
Similar News
News December 8, 2025
జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.
News December 8, 2025
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.
News December 8, 2025
ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.


