News August 22, 2025

శుభ సమయం (22-08-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ చతుర్దశి ఉ.11.53 వరకు
✒ నక్షత్రం: అశ్లేష తె.1.05 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-మ.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12 వరకు, మ.12.24-1.12 వరకు
✒ వర్జ్యం: మ.1.56-3.30 వరకు
✒ అమృత ఘడియలు: రా.11.05-12.39 వరకు

Similar News

News January 12, 2026

Gen Zలో ఎంతో క్రియేటివిటీ: మోదీ

image

Gen Z క్రియేటివిటీతో నిండి ఉందని PM మోదీ అన్నారు. వినూత్న ఆలోచనలు, ఉత్సాహంతో జాతి నిర్మాణంలో యువశక్తి ముందంజలో ఉందని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని వరుసగా పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. దీంతో దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందన్నారు. కల్చర్, కంటెంట్, క్రియేటివిటీతో కూడిన ఆరెంజ్ ఎకానమీలో దేశం అద్భుత వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.

News January 12, 2026

ALERT: ఈ కోడ్స్‌తో కాల్స్ చేయొద్దు!

image

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్‌కు తెరలేపారు. డెలివరీ ఏజెంట్లమని చెబుతూ USSD కోడ్‌లతో కాల్స్ చేయించి యూజర్ల OTPలు తమకు వచ్చేలా చేస్తున్నారు. తర్వాత ఆయా ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్నారు. 21, 61, 67 వంటి USSD కోడ్‌లతో మొదలయ్యే నంబర్లకు డయల్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిందని భావిస్తే ##002#కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయాలని చెబుతున్నారు.

News January 12, 2026

కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదు: SC

image

కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో సమానం కాదని SC స్పష్టం చేసింది. ‘రెగ్యులర్ ఉద్యోగులతో సమాన స్థాయిని వారు కోరలేరు. వారి మధ్య వ్యత్యాసాన్ని తీసేస్తే ప్రభుత్వంలో నియామకాల ఉద్దేశం దెబ్బతింటుంది’ అని పేర్కొంది. నంద్యాల(AP) మున్సిపాల్టీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా మానవతా దృష్టితో వీరిని రెగ్యులర్ చేసే అవకాశాలను చూడాలని సూచించింది.