News December 20, 2024
చివరి 2 టెస్టులకు ఆస్ట్రేలియా స్క్వాడ్ ప్రకటన
BGTలో భాగంగా చివరి 2 టెస్టులకు ఆసీస్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. పాట్ కమిన్స్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్ట్సాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, రిచర్డ్ సన్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్. మూడో టెస్ట్ డ్రా కాగా, నాలుగో టెస్టు మెల్‌బోర్న్, ఐదో టెస్టు సిడ్నీలో జరగనుంది.
Similar News
News January 21, 2025
ముగిసిన KRMB సమావేశం
TG: హైదరాబాద్ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
News January 21, 2025
హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట
AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News January 21, 2025
ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..
అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.