News April 25, 2024

అవినాశ్ అమాయకుడు అయితే హంతకుడు ఎవరు?: సత్యకుమార్

image

AP: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సంచలన ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘అవినాష్ రెడ్డీ అమాయకుడు అయితే మరి హంతకుడు ఎవరు? అర్ధరాత్రి మొబైల్ ఫోన్లలో మంతనాలు నడిపింది ఎవరు? గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించమని చెప్పింది ఎవరు? పాత్రధారిని, సూత్రధారిని రక్షిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నది ఎవరు?’ అని ప్రశ్నించారు.

Similar News

News April 19, 2026

విపక్షాలపై మోదీ ‘భ్రూణ హత్య’ అస్త్రం!

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని మోదీ ‘భ్రూణ హత్య’తో పోల్చడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ విమర్శల కంటే ఇలాంటి భావోద్వేగ పదాలు వాడటం వల్ల మహిళా ఓటర్లలోకి సందేశం బలంగా వెళ్తుందని BJP భావన. విపక్షాలు బిల్లును అడ్డుకోవడం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని పురిట్లోనే చంపేయడమేనని మోదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పదం రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

News April 19, 2026

2027లో అల్లు అర్జున్ ‘రాకా’?

image

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో ఈ సినిమా 2027లో రాదనే వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్‌లో నిజం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా బన్నీ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారట. భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పటికీ 2027 సెకండాఫ్‌లోనే మూవీని రిలీజ్ చేసేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని టాక్.

News April 19, 2026

59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.