News April 26, 2024
‘ముస్లింల రిజర్వేషన్ రద్దు’ను బాబు వ్యతిరేకించలేదు: YCP

AP: చంద్రబాబుతో భేటీ తర్వాతే ముస్లిం రిజర్వేషన్ రద్దుపై ఎన్డీయే ప్రకటన చేసిందని వైసీపీ ట్వీట్ చేసింది. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్.. చంద్రబాబుకు తేల్చి చెప్పారని పేర్కొంది. అయినా ఎన్డీయే నిర్ణయాన్ని బాబు వ్యతిరేకించలేదని, కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4% రిజర్వేషన్ రద్దవడం ఖాయమని తెలిపింది.
Similar News
News April 18, 2026
పొదిలిలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

పొదిలికి చెందిన కొదమల నాగరాజు అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇటీవల భర్త మరొక యువతితో సంబంధం పెట్టుకుని తనని వేధిస్తున్నాడని దీంతో పుట్టింటికి వెళ్లానని భార్య తెలిపింది. భర్తలో మార్పు రాకపోతుందా అని తాను ఇంటికి రాగా.. మామ అసభ్యంగా మాట్లాడి ఇంట్లోకి రానివ్వలేదని ఆరోపించింది. దీంతో ఆమె పిల్లలతో ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసింది.
News April 18, 2026
బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.
News April 18, 2026
ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.


