News April 25, 2024

NRIలకు టికెట్లు అమ్ముకున్న బాబు: కొడాలి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు NRIలకు టికెట్లు అమ్ముకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ‘డబ్బు సంచులతో వచ్చిన ఎన్నారైలకు ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారు. ఎన్నికలు పూర్తికాగానే వారు రిటర్న్ టికెట్ తీసుకుని పారిపోతారు. చంద్రబాబు పాత మేనిఫెస్టోతోనే మళ్లీ వస్తున్నారు. ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. రాష్ట్రంలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 12, 2026

KKRకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి పతిరణ

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గెలుపు ఖాతా తెరవని KKRకు శుభవార్త. స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం నుంచి కోలుకున్నారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి NOC కూడా సాధించారు. దీంతో అతి త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. ఆయన రాకతో KKR బౌలింగ్ విభాగం బలపడనుంది. కాగా కోల్‌కతా 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో ఓడింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>