News June 17, 2024
ఆహారంలో పాము పిల్ల.. అస్వస్థతకు గురైన విద్యార్థులు

బిహార్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆహారంలో పాము పిల్ల కలకలం రేపింది. దీంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆహారంలో చచ్చిపోయిన పాము పిల్ల వచ్చినట్లు స్టూడెంట్స్ ఆరోపించారు. గతంలోనూ ఫుడ్ విషయమై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మెస్ ఓనర్‌కు పెనాల్టీ విధించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 24, 2026
మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.


