News September 12, 2025
బజరంగ్ పునియా తండ్రి కన్నుమూత

భారత రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత బజరంగ్ పునియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి బల్వాన్ పునియా ఊపిరితిత్తుల సమస్యతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో గత 18 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు తన తండ్రి చాలా కష్టపడ్డారని, కుటుంబానికి ఆయనే వెన్నెముక అని బజరంగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Similar News
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.


