News February 27, 2025
మహారాష్ట్రలో గోధుమపిండితో బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.
Similar News
News February 27, 2025
‘భారత్‌ను ఫైనల్లో ఓడిస్తామన్నావుగా.. ఇప్పుడేమైంది?’

AFG చేతిలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ క్రికెటర్ డకెట్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల INDపై వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక డకెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం 3-0 తేడాతో ఓడినా పెద్ద మ్యాటర్ కాదు. మేం ఇక్కడికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వచ్చాం. ఇండియాను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిస్తాం. అప్పుడు ఈ ఓటమిని ఎవరూ గుర్తుంచుకోరు’ అని అన్నారు. కానీ CTలో ఇంగ్లండ్ సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.
News February 27, 2025
‘తెలుగు’కు దక్కిన గౌరవం

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.
News February 27, 2025
‘పంజా విసిరే పులులు’.. ఐసీసీ ట్రోఫీల్లో అఫ్గాన్ హవా

తాము పసికూనలం కాదు పంజా విసిరే పులులం అని అఫ్గానిస్థాన్ మరోసారి నిరూపించింది. 2023 వన్డే WC నుంచి ఆ జట్టు పెద్ద టీంలకు ఝలక్ ఇస్తోంది. 2023 WCలో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలను మట్టికరిపించింది. 2024 టీ20 WCలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్‌కు వెళ్లింది. తాజాగా CTలో ఇంగ్లండ్‌ను ఓడించి ఇంటిదారి పట్టేలా చేసింది. తమ దేశంలో సరైన ప్రాక్టీస్ సౌకర్యాలు లేకున్నా అఫ్గాన్ రాణించడం విశేషం.