News August 12, 2025

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ: US

image

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(BLA), దాని సహచర సంస్థ మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. కొన్ని దాడుల తర్వాత 2019లో BLAను స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించారు. 2019నుంచి మజీద్ బ్రిగేడ్ ద్వారా జరిగిన దాడులకు BLA బాధ్యత వహించినట్లు పేర్కొంది. ఇటీవలదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ, ఇది పాకిస్థాన్ కోసం చేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

Similar News

News August 12, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

image

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.

News August 12, 2025

చెప్పే కథ ఒకటి.. తీసేది ఇంకొకటి: అనుపమ

image

తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

News August 12, 2025

టెంపో ప్రమాదంలో.. 10కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర పుణే జిల్లా మహాలుంగేలో <<17371241>>టెంపో<<>> లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది ఉన్నారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్‌ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.