News August 5, 2024
బంగ్లా క్రైసిస్.. మోదీ కీలక భేటీ

బంగ్లాదేశ్ సంక్షోభం, ప్రధానిగా రాజీనామా అనంతరం షేక్ హసీనా భారత్ వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సభ్యులైన అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమయ్యారు. బంగ్లాలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా యూపీలోని హిండన్ ఎయిర్ బేస్‌లోని ఓ ఇంట్లో ప్రస్తుతం హసీనా తలదాచుకున్నారు.
Similar News
News December 12, 2025
జట్టులో సూర్య, గిల్ అవసరమా?

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్‌లో ఉన్న శాంసన్, జైస్వాల్ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
ప్రతి ఇంట్లో గంగా జలం ఎందుకు ఉండాలి?

ప్రతి ఇంట్లో గంగా జలం తప్పనిసరిగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల శక్తితో గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటున్నారు. ‘గంగాజలం ఎప్పటికీ పాడవదు. ఎన్నేళ్లైనా గంగాజలాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. పూజలు, శుభకార్యాల సమయంలో ఉపయోగించవచ్చు. ఇల్లు కడిగేటప్పుడు, ఇంటికి సున్నం వేసే నీటిలో కొద్ది గంగా జలం వినియోగిస్తే.. ఏ ప్రతికూల శక్తి ప్రవేశించదు’ అని అంటున్నారు.
News December 12, 2025
చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.


