News August 5, 2024

బంగ్లా: హిందూ ఆలయాలు, ఇందిరా కేంద్రానికి మంటలు

image

బంగ్లాలో అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. హిందూ ఆలయాలు, స్మృతి కేంద్రాలను తగలబెడుతున్నాయి. రంగాపుర్ సిటీలో హిందూ కౌన్సిలర్ హర్షవర్ధన్‌ను కాల్చిచంపిన దుండగులు ఇస్కాన్ సహా కాళీ ఆలయాలే లక్షంగా నిప్పంటించారు. ఇక ఢాకాలో ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్, బంగబంధు మెమోరియల్ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. కొంత భాగాన్ని తగలబెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కీలక కూడళ్లలో మౌలిక సదుపాయాల్నీ నాశనం చేస్తున్నారు.

Similar News

News December 7, 2025

సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

image

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.

News December 7, 2025

ఇండిగో సంక్షోభం: గుత్తాధిపత్యమే ముంచిందా?

image

దేశంలో విమానయాన సంక్షోభానికి ఇండిగో గుత్తాధిపత్యమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండిగో(63%), ఎయిరిండియా(20%) తప్ప మిగతా సంస్థల వాటా నామమాత్రమే. కానీ 2014లో ఇండిగో(31.8%), జెట్ ఎయిర్‌వేస్(21.7%), ఎయిరిండియా(18.4%), స్పైస్ జెట్(17.4%), గో ఎయిర్(9.2%) ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు ఇండిగోలో సిబ్బంది కొరతతో పరిస్థితి తీవ్రమైంది. అదే మరిన్ని సంస్థలు ఉంటే ఇలా జరిగేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

News December 7, 2025

రోహిత్, కోహ్లీలకు గంభీర్ షాక్!

image

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన సిరీసుల్లో రాణించినప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. విరాట్, రోహిత్ శర్మలు 2027 WC ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేదు. వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారా అని జర్నలిస్టులు అడగ్గా.. ‘వన్డే ప్రపంచకప్ మరో రెండేళ్లు ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యంగ్ ప్లేయర్లు చక్కగా ఆడుతూ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.