News April 20, 2024
జాగ్రత్త.. మరో మూడురోజులు వడగాల్పులు

AP: రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం సాధారణం కంటే 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు 55మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. ఆదివారం 44మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది’ అని తెలిపారు. శుక్రవారం గరిష్ఠంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 11, 2025
ఉత్కంఠ.. 4 ఓట్లతో గెలిచింది

TG: హన్మకొండ(D) ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి.స్రవంతి 4 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో BRS బలపరిచిన భాగ్యమ్మ 5 ఓట్లతో గట్టెక్కారు. వరంగల్(D) వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.
News December 11, 2025
ఆఫీస్‌కు త్వరగా వస్తోందని ఉద్యోగి తొలగింపు.. నెట్టింట చర్చ!

ఆఫీసుల్లో సమయపాలన ఎంత ముఖ్యమో తెలిపే ఘటనే ఇది. స్పెయిన్‌లో 22 ఏళ్ల యువతిని ఓ కంపెనీ పంక్చువాలిటీ లేదని తొలగించడం చర్చనీయాంశమైంది. తన షిఫ్ట్ టైమింగ్‌కు కాకుండా 40 నిమిషాలు ముందుగానే ఆమె ఆఫీసుకు వచ్చింది. వార్నింగ్ ఇచ్చినా 19సార్లు ఇలానే రావడంతో యాజమాన్యం విసుగుచెందింది. ఇలా చేయడం వల్ల మిగతా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని కంపెనీ ఆరోపిస్తోంది. దీనిపై ఆ యువతి కోర్టుకెళ్లినా ఫలితం దక్కలేదు.
News December 11, 2025
AP క్యాబినెట్ నిర్ణయాలు

*పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
*సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
*AP ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
*రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
*SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
*కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం


