News May 2, 2024

సీక్వెల్స్‌కి సీటీ కొట్టడం మంచిదే!

image

సినిమాల సీక్వెల్స్‌ ట్రెండ్‌ ఇటీవల బాగా పెరిగింది. అయితే ఇది మంచి పరిణామమే అని సినీ వర్గాలు అంటున్నాయి. కొన్ని కథలను 2-3 గంటల్లో చెప్పడం కుదరదు. నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు అంతసేపు కూర్చొని చూడలేరు. రెండు పార్టులతో అయితే కథని వివరించి చెప్పొచ్చు. దీనివల్ల సినీ పరిశ్రమపై ఆధారపడ్డ వారికి ఉపాధి దొరుకుతుంది. అలాగే సీక్వెల్‌ సినిమాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో తగ్గేదేలే అంటున్నాయి.

Similar News

News December 13, 2025

GNT: జాతీయ లోక్ అదాలత్‌లో 23,466 కేసుల పరిష్కారం

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఒకేరోజు 23,466 కేసులు పరిష్కారం అయ్యాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో 17 బెంచీలతో కలిపి, జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో 1,376 సివిల్, 21,415 క్రిమినల్, 578 చెక్ బౌన్స్, 97 ప్రీలిటికేషన్ కేసులలో రూ.57,68,57,572 ఇప్పించారు.

News December 13, 2025

పడమర దిక్కులో బోరు బావి ఉండవచ్చా?

image

సాధారణంగా ఇంటికి అవసరమయ్యే నీటి వనరులు ఈశాన్యం/ ఉత్తర దిక్కులలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయినప్పటికీ పడమర దిక్కులో బోరు వేయడం వలన నీటి అవసరం తీరుతుంది కాబట్టి ఇది వాస్తు పరంగా ఆమోదయోగ్యమే అని అంటున్నారు. ‘నీరు అనేది ప్రాథమిక అవసరం కాబట్టి, దానిని మంచి స్థలంలో నిల్వ చేసుకున్నా, నిత్యం అందుబాటులోకి తెచ్చినా తప్పేం ఉండదు. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>

News December 13, 2025

రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

image

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.