News April 30, 2024
జాగ్రత్త! తెలివిగా ఓటేయండి: హర్ష గోయెంకా

ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎన్నికల వేళ ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ట్విటర్ ఖాతా ద్వారా తరచూ పలు అంశాలపై ప్రజలకు సూచనలు చేసే ఆయన ఒక్క ఫొటోతో ఓటు విలువను చాటి చెప్పారు. ‘ప్రజలారా జాగ్రత్త! నేతల వాగ్దానాలపై కాకుండా పనితీరుపై ఆలోచించండి. తెలివిగా ఓటు వేయండి. మోసపోకండి’ అంటూ ట్వీట్ చేశారు. దానికి ‘పాలకుల చేతిలో మనం బకరా కావొద్దు’ అని అర్థం వచ్చేలా ఓ పెద్ద మేక ఫొటోను జతచేశారు.
Similar News
News December 10, 2025
APPLY NOW: భారీగా టీచర్ పోస్టులు

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచర్లు, లైబ్రేరియన్ వంటి పోస్టులు ఉన్నాయి. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్‌ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.


