News December 5, 2024

BGT: రేపటి నుంచి రెండో టెస్టు

image

BGTలో భాగంగా రేపటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. ఉ.9:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పింక్ బాల్ టెస్టుల్లో AUSకి మెరుగైన రికార్డు ఉండడంతో IND ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన భారత జట్టు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

Similar News

News January 26, 2025

మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!

image

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News January 26, 2025

అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.

News January 26, 2025

టీ20ల్లో అరుదు

image

SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.