News May 1, 2024

10 రోజులు భాగ్యనగర్ బంద్

image

TG: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 10 రోజులు బంద్ కానుంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు.. ఆ తర్వాత 16 నుంచి 22వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 3వ రైల్వే లైన్‌లో సాంకేతిక పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సూపర్‌ఫాస్ట్, రాజధాని రైళ్లకు లేని అడ్డంకులు.. సాధారణ, మధ్యతరగతి ప్రయాణించే భాగ్యనగర్‌కే ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News December 8, 2025

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.

News December 8, 2025

CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

image

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్‌ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.

News December 8, 2025

ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

image

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.