News September 13, 2025

బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

image

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.

Similar News

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.

News December 17, 2025

కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

image

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 17, 2025

BIG BREAKING: MLAల అనర్హత పిటిషన్ల కొట్టివేత

image

TG: ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు సాంకేతికంగా BRSలోనే ఉన్నట్లు వెల్లడించారు. కాగా రేపు పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.