News March 27, 2024

రాష్ట్రంలో భానుడి భగభగలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ ఎండలు దంచికొట్టాయి. భానుడి భగభగతో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎండల తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 13, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/elecresult/election-result-2024.html?lang_id=1&states=Telagana%20Muncipal%20Election%20Results,Telangana%20Corporation%20Election%20Results

News February 13, 2026

గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. గద్వాలలోని ఓ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఓటుతో గెలిపించుకున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట, చౌటుప్పల్‌లోనూ ఇలాగే చేశారని చెప్పారు. 16 మున్సిపాలిటీల్లో నేరుగా గెలుస్తున్నామని, మరో 10-15 చోట్ల BRS లార్జెస్ట్ పార్టీ అని తెలిపారు.

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.