News September 10, 2025
BHPL: ‘చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శం’

సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఐడిఓసిలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Similar News
News December 5, 2025
నలుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరం: మంత్రి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థుల మృతి పట్ల అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్ ఉన్న యువకులు ఇలాంటి విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
News December 5, 2025
ములుగు: ఆ ఒక్కరోజు తేడా వస్తే అంతే సంగతి!

పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఓటింగ్ ముందు రోజు అత్యంత కీలకం కానుంది. ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత సింపతీ కూడగట్టుకున్నా ఆ ఒక్కరోజు ఓటర్లను వశం చేసుకోవడం పెద్ద టాస్క్. పంపకాల్లో తేడా వస్తే చేసిన ప్రచారం, అభివృద్ధి, హామీలు నీరుగారిపోయినట్లేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ములుగు(D)లో ఈసారి ప్రధాన, ప్రతిపక్ష అభ్యర్థులే అనేకచోట్ల బరిలో ఉండటంతో అంచనాలు పెరిగాయి.
News December 5, 2025
విజయోత్సవ ర్యాలీలు, డీజేలు నిషేధం: సూర్యాపేట ఎస్పీ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు. ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. బాణాసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమన్నారు.


