News September 10, 2025

BHPL: ‘జాతీయ లోక్-అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాజీ మార్గమే.. రాజ మార్గం. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు’ అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.

Similar News

News December 15, 2025

తీవ్ర పొగమంచు.. మోదీ టూర్‌పై ఎఫెక్ట్

image

తీవ్ర పొగమంచు ప్రభావం ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టును పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకే ఆయన బయల్దేరాల్సి ఉంది. ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. కాగా ఉత్తర భారతంలో పొగమంచు వల్ల పలు రోడ్డు <<18561671>>ప్రమాదాలు<<>> చోటుచేసుకుంటున్నాయి. విమాన సర్వీసులపైనా తీవ్ర ప్రభావం పడింది.

News December 15, 2025

బంధాలకు భయపడుతున్నారా?

image

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్‌మెంట్‌కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.

News December 15, 2025

మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

image

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్‌లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్‌గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.