News March 14, 2025

BHPL: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

జయశంకర్ భూపాలపల్లిలో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

Similar News

News February 16, 2026

నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

image

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

News February 16, 2026

MBNR: ఎవరూ అరెస్టు కాలేదు: ఎమ్మెల్యే

image

ఎవరూ అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు.

News February 16, 2026

మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

image

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.