News May 7, 2025

BHPL: రేపే BRS రజతోత్సవ సభ

image

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్

Similar News

News February 17, 2026

వరంగల్: నాడు ఒక్క ఓటుతో ఓడి.. నేడు వైస్ ఛైర్మన్‌గా!

image

వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 2020లో ఇదే 5వ వార్డు నుంచి నేతావత్ శిభారాణి రాజేందర్ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ తరఫున స్వతంత్ర అభ్యర్థిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా ఈసారి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆమెకు వైస్ ఛైర్మన్ పదవి లభించింది. ఇక తండావాసుల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు.

News February 17, 2026

ప్రకాశం: ‘చిన్నారి మృతి.. విచారణలో జాప్యమెందుకు’

image

సింగరాయకొండ నవోదయకోచింగ్ సెంటర్లో తౌశిక్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు దాటినప్పటికీ విచారణలో జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కారణమని వారు బహిరంగంగా చెబుతున్నా.. పోలీసులు వార్డెన్‌ను విచారించకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. వార్డెన్‌పైనే తమకు అనుమానం ఉందని వారు బహిరంగంగా చెబుతున్నారు.

News February 17, 2026

300కు 300 మార్కులు

image

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.